: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ప్రెస్ మీట్ రద్దు
తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి రాజయ్య ఈరోజు జరగాల్సిన తన ప్రెస్ మీట్ ను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. వాస్తవానికి నేటి ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజయ్య కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని అందరూ ఊహించారు. అయితే, ప్రెస్ మీట్ రద్దు కావడం వెనకున్న కారణాలు మాత్రం తెలియరాలేదు. అటు సమావేశం క్యాన్సిల్ అయిన విషయాన్ని రాజయ్య సన్నిహితులు కూడా ధ్రువీకరించారు. కాగా నేటి టీఆర్ఎస్ సమావేశానికి రాజయ్యను కూడా ఆహ్వానించారు.