: ఇక 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో రైలు టిక్కెట్లు


రైలు ప్రయాణికులకు ఒక మంచి వార్త. ఇకపై రైలు టిక్కెట్ మీ ఇంటి వద్దకే అందించే సౌలభ్యాన్ని రైల్వేశాఖ అతి త్వరలో ప్రవేశపెట్టనుంది. అది కూడా టిక్కెట్ చేతికి వచ్చిన తరువాత డబ్బు చెల్లించే 'క్యాష్ ఆన్ డెలివరీ' (సీవోడీ) విధానం ద్వారా. ఈ పద్ధతిలో ఎవరైనా ఇంటి వద్దే డబ్బు చెల్లించి టిక్కెట్ పొందవచ్చు. ఇప్పటివరకూ ఆన్ లైన్లో ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ ద్వారా వెంటనే నగదు చెల్లించాల్సి వచ్చేది. అయితే, క్రెడిట్, డెబిట్ కార్డుల మోసాలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలిదశలో ఎంపిక చేసిన 200 నగరాల్లో 'క్యాష్ ఆన్ డెలివరీ' అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రయాణికులు కనీసం అయిదు రోజులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News