: పార్టీల నిధులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ఆప్
తమ పార్టీకి వచ్చిన నిధులపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో మరో ముందుడుగు వేయనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలకు వచ్చిన నిధులపై దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)తో విచారణ జరిపించాలని కోరనుందట. పార్టీకి వచ్చిన నిధులన్నీ బోగస్ అని, పన్ను ఎగవేయడానికి పుస్తకాల్లో నకిలీ ఎంట్రీలు చేశారంటూ ఆప్ వాలంటీర్ యాక్షన్ మంచ్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు చేయాలని ఆప్ స్వయంగా డిమాండ్ చేస్తోంది.