: కిరణ్ బేడీ కార్యాలయంపై దాడి... బీజేపీ కార్యకర్తలకు గాయాలు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ కార్యాలయాలపై భౌతిక దాడులూ మొదలయ్యాయి. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కార్యాలయంపై నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. కిరణ్ బేడీ పోటీ చేస్తున్న కృష్ణానగర్ లోని కార్యాలయంపై జరిగిన ఈ దాడిలో భవనం అద్దాలు పగిలిపోయాయి. దాడి సందర్భంగా కార్యాలయంలో ఉన్న కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. దాడిపై సమాచారం అందుకున్న కిరణ్ బేడీ తన ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకుని అక్కడికి వెళ్లిపోయారు. దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News