: విడాకులే మేలంటున్న 'టైటానిక్' భామ కేట్!


ఎవరైనా దంపతులు విడిపోవాలని భావిస్తే కలపడానికి ప్రయత్నిస్తాం. వారి పిల్లల కోసమైనా సర్దుకుపోవాలని నచ్చచెబుతాం. కానీ, హాలీవుడ్ నటి కేట్ విన్ స్లెట్ మాత్రం భార్యభర్తలు విడిపోతేనే వారి పిల్లలకు మంచిదని చెబుతోంది. సుమారు పదిహేనేళ్ళ క్రితం వచ్చిన టైటానిక్ చిత్రంతో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన ఈ భామ ఇప్పుడు వేదాలు వల్లిస్తోంది. చిన్నతనంలో ఏకాకిగా మారితేనే నిజమైన జీవితం అంటే ఏంటో తెలుసొస్తుందని చెబుతోంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒంటరిగా ఫేస్ చేస్తేనే భవిష్యత్తు అందంగా ఉంటుందని అంటోంది. అన్నట్టు తన వ్యక్తిగత జీవితంలో రెండు సార్లు విడాకులు తీసుకున్న విన్ స్లెట్ కు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News