: తెలంగాణ వర్సిటీ లేడిస్ హాస్టల్ లో ఆకతాయిలు... చితకబాదిన అమ్మాయిలు!


నిజామాబాదులోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాత్రి కలకలం రేగింది. వర్సిటీలోని లేడిస్ హాస్టల్ లోకి కొంతమంది ఆకతాయిలు ప్రవేశించి నానా రభస సృష్టించేందుకు యత్నించారు. అయితే ఆకతాయిల దుశ్చర్యలకు ఏమాత్రం భయపడని వర్సిటీ విద్యార్థినీలు, వారి భరతం పట్టారు. హాస్టల్ లోకి చొరబడ్డ ఆకతాయిలను చుట్టుముట్టిన అమ్మాయిలు ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆకతాయిలు పరుగులు పెట్టారు. అయినా విడిచిపెట్టని అమ్మాయిలు, వారి వెంటబడి మరీ ముగ్గురు ఆకతాయిలను బంధించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పజెప్పారు.

  • Loading...

More Telugu News