: టీమిండియాకి హాలీడే ఇవ్వడం వెనుక కారణం ఏంటి?
టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ కి వారం రోజులు సెలవులు ప్రకటించడానికి దారి తీసిన కారణాలు ఏంటి? ఆటగాళ్లు సిరీస్ లు ఆడి అలసిపోయారా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అనే విషయంపై సీరియస్ చర్చ నడుస్తోంది. టీమిండియా ఆటగాళ్లకు హాలీడే ప్రకటించడం వెనుక కారణంగా ఆసీస్ లో జరిగిన ముక్కోణపు ట్రోఫీ అని తెలుస్తోంది. వరల్డ్ కప్ ముందు విదేశాల్లో జరుగుతున్న సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సిన చోట ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు డ్రెస్సింగ్ రూం చేరుదామా అనేలా ప్రవర్తించారట. మ్యాచ్ ముగియడంతోనే ల్యాప్ ట్యాప్ లకు అతుక్కుపోయేవారు. ఫ్యామిలీ, స్నేహితులతో ఛాటింగ్ లోనే మునిగిపోయేవారట. దీంతో ప్రాక్టీస్ కు కూడా ఆలస్యంగా హాజరయ్యేవారట. దీనికి తోడు ఎంత తొందరగా మ్యాచ్ ముగుస్తుందా? ఎప్పుడు వెళ్లి ఛాటింగ్ లో మునిగిపోదామా? అనేలా తయారయ్యారట. ఇలాగే ఉంటే పరిస్థితి దిగజారుతుందని గమనించిన, కోచ్, మేనేజర్, సీనియర్ దిగ్గజ ఆటగాళ్ల సలహాతో బీసీసీఐ టీమిండియా జట్టుకు వారం రోజులు హాలీడే ప్రకటించినట్టు తెలుస్తోంది.