: జాతీయ గీతం ఆలపించిన అమితాబ్... నెట్టింట్లో వీడియో హల్ చల్
భారతదేశ కీర్తిపతాకను ఖండాంతరాలు దాటించిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. అమితాబ్ సినిమా ఒప్పుకున్నా, యాడ్ చేసినా, ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నా అది తప్పక చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు అమితాబ్ జాతీయ గీతం ఆలపించారు. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? 'షమితాబ్' సినిమా కోసం అమితాబ్ ఆలపించిన ఈ గేయాన్ని, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంట్లో చిత్రీకరించడం విశేషం. రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం పక్కనే నిల్చున్న అమితాబ్ ఆలపించిన జాతీయగీతం వీడియోను ఇరోస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అభిమానులు ఆసక్తిగా ఈ వీడియోను తిలకిస్తున్నారు.