: స్టూడెంట్స్ కి గుండు గీయించిన వార్డెన్
సాధారణంగా ఎవరైనా పెను తప్పిదానికి పాల్పడిన పక్షంలో గుండుగీయిస్తామన్న హెచ్చరికలు వినపడుతుంటాయి! కానీ, బెంగళూరులోని ఓ హాస్టల్ వార్డెన్ విద్యార్థులు స్కూలుకి వెళ్లడం లేదని గుండుగీయించి వివాదం రేపాడు. బెంగళూరులోని విటల్ మాలియా రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9,10 చదువుతున్న కొంతమంది విద్యార్థులు గత వారం స్కూలు ఎగ్గొట్టారు. దీంతో, ఆగ్రహించిన హాస్టల్ వార్డెన్ మరోసారి ఇది పునరావృతం కానివ్వొద్దంటూ వారికి గుండు కొట్టించాడు. దీంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతులకు హాజరుకాకపోతే మందలించాలి కానీ, గుండు గీయిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల గుండుగీయించామని వార్డెన్ చెబుతున్నారు.