: ఐఎస్ఐఎస్ చర్యను తీవ్రంగా ఖండించిన మోదీ
ఇద్దరు జపాన్ దేశస్తులను అత్యంత కర్కశంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతమార్చడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. 'ఈ చర్య అత్యంత కిరాతకం, అమానుషం' అంటూ ట్వీట్ చేశారు. జపాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కెంజి గొటొతో పాటు మరో పౌరుడు హరునా యుకావాకు ఐఎస్ ముష్కరులు శిరచ్ఛేదం చేశారు. అంతేకాకుండా, ఆ వీడియోను ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. ఐఎస్ కిరాతకంపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ దారుణంపై ఘాటుగా స్పందించిన జపాన్ ప్రధాని షింజో అబే... ఐఎస్ ఉగ్రవాదులను క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.