: తమిళనాడులో దుకాణం తెరవనున్న మజ్లిస్!
హైదరాబాదులో బాగా పట్టున్న మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో సంతృప్తికర ఫలితాలు రావడంతో, తాజాగా తమిళనాడులోనూ పార్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది ముస్లిం నేతలు హైదరాబాద్ వచ్చి అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారు. పక్షం రోజుల వ్యవధిలో తమిళనాడు ముస్లిం నేతలు హైదరాబాదు రావడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 27న తమిళనాడులో మజ్లిస్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అక్బర్ వారితో చెప్పినట్టు తెలుస్తోంది.