: నలుగురు పిల్లల్ని కనమన్నాను... 40 కుక్క పిల్లల్ని కాదు: సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు


బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఎంతగా హెచ్చరిస్తున్నా ఎక్కడో ఒకచోట వివాదం రేగుతూనే ఉంది. గత రాత్రి జరిగిన ఒక బహిరంగ సభలో కాషాయ వస్త్రాలు ధరించిన సాధ్వి ప్రాచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ప్రజలు నలుగురు పిల్లలను కలిగి ఉండాలని కోరాను. 40 కుక్కపిల్లల్ని కాదు. హిందూ మతాన్ని కాపాడుకోవాలి" అని ఆమె అన్నారు. ఈ సభలో ఆమె మైనారిటీల గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ తరహా ప్రసంగాలు ఆమోదయోగ్యం కాదని, సాధ్వి ప్రాచితో ఈ విషయమై మాట్లాడతానని ఉత్తర ప్రదేశ్ బీజేపీ హెడ్ లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ తెలిపారు.

  • Loading...

More Telugu News