: ఎంసెట్ విడిగా నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఎంసెట్ విడిగా నిర్వహించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉదయం నుంచి జరుగుతున్న క్యాబినెట్ భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు, కొత్త సౌర విద్యుదుత్పత్తి విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సౌర విద్యుదుత్పత్తి విధానంలో యూనిట్ కు రూ.5.25 చెల్లించనున్నారు. రాష్ట్రంలో 38,500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఏకగవాక్ష విధానం (సింగిల్ విండో) ద్వారా అనుమతుల మంజూరుకు మంత్రివర్గం అంగీకరించింది.