: ఆప్ లో చేరిన టీవీ నటులు


ఢిల్లీలో మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల హిందీ టీవీ నటులు ఆకర్షితులవుతున్నారు. గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ 'ఆప్' లో చేరిన కొన్ని రోజులకు అయూబ్ ఖాన్, స్మిత బన్సల్ అనే ఇద్దరు టెలివిజన్ నటులు ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. 'దిల్ చాహతా హై', 'చెహరా' వంటి పలు బాలీవుడ్ సినిమాలు, 'ఉత్తరణ్', 'ఏక్ హసీనా థీ' వంటి పలు సీరియళ్లలో అయూబ్ ఖాన్ నటించారు. కేజ్రీవాల్ మార్పు తీసుకువస్తారన్న అంచనాలతోనే వివిధ ప్రాంతాల నుంచి పలువురు చేరుతున్నారన్నారు. సామాన్యుడి కోసం కేజ్రీ పోరాడుతున్నారని, అందుకే మంచి రాష్ట్రం, జాతి కోసం ఆప్ లో చేరాలని ఖాన్ కోరారు. ఇక, స్మిత మాట్లాడుతూ, కేజ్రీ అభిప్రాయాలు, భావజాలమే ఆయనను ప్రజలు అనుసరించేలా చేశాయన్నారు. అందుకే, ఆయన ఆలోచనలకు, ఉద్దేశాలకు మద్దతిస్తే, మార్పులో మనం కూడా భాగమైనట్టేనని అన్నారు. పాప్యులర్ సీరియల్ 'బాలిక వధు'లో ఆమె నటించారు.

  • Loading...

More Telugu News