: మరో ప్రకటనతో కేజ్రీవాల్ పై బీజేపీ దాడి
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై ప్రకటనల రూపంలో బీజేపీ దాడి కొనసాగుతూనే ఉంది. తొలుత ఓ ప్రకటనలో అన్నాహజారే, కాంగ్రెస్ తో లింక్ చేసి కేజ్రీని విమర్శించింది. తాజాగా మరో ప్రకటనలో ఆప్ నేత లక్ష్యంగా వ్యంగ్యాస్త్రం సంధించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రధాన వార్తా పత్రికల్లో కార్టూన్ రూపంలో రూపొందించిన ఓ ప్రకటనను ఇచ్చింది. తొలిసారి సీఎం పదవి చేపట్టిన అనంతరం కేజ్రీ ఓ ఏడాది గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగిస్తానని బెదిరించడం, ఆ మరుసటి ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కు విఐపీ పాస్ అడగడాన్ని అందులో పేర్కొంది. అంతేగాక, కేజ్రీవాల్ 'ఉపద్రవి (రచ్చ) గోత్రానికి చెందినవాడని కుల సంబంధ వ్యాఖ్యలు చేసింది. దాంతో కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.