: ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సీపీఎం విముఖత


రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరాదని సీపీఎం అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చేసింది. కేవలం వామపక్ష పార్టీలతోనే పొత్తులు, బంధాలను ఏర్పరుచుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ముసాయిదా తీర్మానాన్ని సిద్ధం చేసింది. ఏప్రిల్ నెలలో జరిగే సీపీఎం మహాసభలలో ఈ అంశంపై లోతుగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని సంకల్పించింది. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్లే తమ పార్టీ నష్టపోతోందని సీపీఎం నేతలు భావిస్తున్నట్టు సమాచారం. వామపక్ష పార్టీలతో కలసి, ఉద్యమాలను నిర్మించడం ద్వారా ప్రజాదరణ పొందాలనేది ఈ పార్టీ అభిమతంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News