: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు మొట్టికాయలు!


తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టు భావిస్తున్నామని కోర్టు తెలిపింది. ఎన్నికల జాప్యం తగదని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించవద్దని మొట్టికాయలు వేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో వెల్లడిస్తూ, కచ్చితమైన తేదీలతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన న్యాయస్థానం, అందుకు వారం రోజుల సమయం ఇస్తున్నట్టు తెలిపింది. ఈలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని వ్యాఖ్యానించిన కోర్టు, ఎన్నికల వాయిదాలు తగదని హితవు పలికింది.

  • Loading...

More Telugu News