: ఢిల్లీ పర్యావరణ సదస్సులో ప్రధాన ఆకర్షణగా 'టెర్మినేటర్'


హాలీవుడ్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ మరోసారి భారత్ వస్తున్నారు. ఢిల్లీలో జరిగే వార్షిక పర్యావరణ సదస్సులో ఈ 'టెర్మినేటర్' సిరీస్ హీరో కూడా పాల్గొంటారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు ఈ సదస్సు నిర్వహిస్తారు. ఈ మేధోమథన సదస్సులో వాతావరణ మార్పులు, గాలిలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వంటి ప్రధాన సమస్యలను చర్చిస్తారు. ష్వార్జ్ నెగ్గర్ 'ఆర్ 20 రీజియన్స్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్' పేరిట స్వచ్ఛంద సేవా సంస్థ నెలకొల్పి పర్యావరణ హితానికి తనవంతు పాటుపడుతున్నారు. 2007, 2012లోనూ ఆయన పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. కాగా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ తీసుకుంటున్న చర్యలను ఈ సమ్మిట్ లో వివరిస్తారని భావిస్తున్నారు. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ (టీఈఆర్ఐ) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది.

  • Loading...

More Telugu News