: వైకాపాలో ముసలం?... జగన్ వైఖరిపై మైసూరాలో అసంతృప్తి!
వైకాపాలో కీలక నేత అయిన మైసూరా రెడ్డి అలకపాన్పు ఎక్కారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీలో తనకు ఎంతో ప్రాధాన్యత దక్కినప్పటికీ, ఆ పార్టీని కాదనుకుని వైకాపాలో చేరానని... అయితే, తన స్థాయికి తగ్గ ప్రాధాన్యత ఇక్కడ దక్కడం లేదనే భావనలో మైసూరా ఉన్నారని సమాచారం. ఇటీవల కాలంలో ఆడిటర్ విజయసాయి రెడ్డికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. దశాబ్దాల రాజకీయానుభవం ఉన్న తనకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మైసూరా జీర్ణించుకోలేకపోతున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే, తణుకులో జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి మైసూరా కావాలనే దూరంగా ఉన్నారనే వార్త పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. జగన్ పై మైసూరా నిజంగా అలిగారా? లేక మరేదైనా కారణం వల్ల ధర్నాకు దూరంగా ఉన్నారా? అనే విషయం తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.