: రాష్ట్ర విభజన మావోయిస్టులకు కలిసొచ్చిందా?
ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు అడుగంటిన స్థితికి చేరుకుంది. ఏపీ సర్కారు కఠిన చర్యల నేపథ్యంలో అగ్రనేతలందరూ ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ అడవుల బాటపట్టడంతో రాష్ట్రంలో వారి ఉనికే కనుమరుగయ్యే ప్రమాదంలో పడింది. అయితే, రాష్ట్ర విభజనతో పరిస్థితిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు ఇతర అంశాలకు ప్రాధాన్యతనివ్వడంతో మావోలకు కాస్త వెసులుబాటు లభించినట్టయింది. ఈ క్రమంలో, మావోయిస్టులు మెల్లమెల్లగా తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా భద్రాచలం జోన్ లో మావోయిస్టులు తాజాగా స్పెషల్ జోనల్ కమిటీని ఏర్పాటు చేశారని ఓ అధికారి తెలిపారు. అటు, ఏపీలోనూ సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు ఊపందుకున్నట్టు సమాచారం.