: మడకశిర ఘాట్ లో బ్రేకులు ఫెయిలైన ఆర్టీసీ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు


అనంతపురం జిల్లా మడకశిరలో ఇటీవల లోయలో పడ్డ బస్సు ప్రమాదం మరువకముందే అదే తరహాలో మరో ప్రమాదం చోటుచేసుకోబోగా, డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మడకశిర నుంచి హైదరాబాదు బయలుదేరిన బస్సు బ్రేకులు నేటి ఉదయం ఫెయిలయ్యాయి. రొద్దం సమీపంలోని ఘాట్రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును నిలిపేశాడు. ఘాట్ రోడ్డులో బస్సు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. విషయం తెలుసుకుని బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో పంపించినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News