: చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ లేదు... ఆ వార్తలన్నీ అవాస్తమన్న జైలు సూపరింటెండెంట్


చర్లపల్లి జైలులో ఖైదీలకు స్వైన్ ఫ్లూ సోకిందన్న వార్తలు అవాస్తవమని జైలు సూపరిండెంట్ వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరణ నేపథ్యంలో తాము ఇప్పటికే 2 వేల మంది ఖైదీలకు వ్యాధి నివారణ మందులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. స్వైన్ ఫ్లూ బారిన పడి ఓ ఖైదీ మృతి చెందాడనే వార్తలను ఆయన ఖండించారు. మూడు రోజుల క్రితం మృతి చెందిన సదరు ఖైదీ స్వైన్ ఫ్లూ తో చనిపోలేదని, అతడు గుండెపోటుతో మరణించాడని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News