: తిరుపతి ఉప ఎన్నికలో ఇక ప్రచార హోరు... నేడు ఏపీసీసీ చీఫ్ రఘువీరా ప్రచారం


టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణం నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతిలో ఇక ప్రచారం ఊపందుకోనుంది. పదవిలో ఉండగా మరణించిన ప్రజా ప్రతినిధుల కుటుంబ వ్యక్తులు పోటీ చేస్తే, పోటీకి దిగరాదని ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయానికి తిలోదకాలిస్తూ అభ్యర్థిని బరిలోకి దింపిన కాంగ్రెస్ పార్టీ, నేటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి నేడు తిరుపతిలో పార్టీ అభ్యర్థి శ్రీదేవి తరఫున ప్రచారం చేయనున్నారు. రఘువీరా ప్రచారం నేపథ్యంలో స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరం కానున్న నేపథ్యంలో టీడీపీ కూడా ఈ దిశగా సమాయత్తమవుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News