: చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ కలకలం... ఖైదీ మృతి, మరో రోగికి చికిత్స
హైదరాబాదులోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. ప్రాణాంతక వైరస్ గా పరిణమించిన స్వైన్ ఫ్లూ జైలులోని ఇద్దరు ఖైదీలకు సోకింది. దీంతో సదరు ఖైదీలిద్దరినీ జైలు అధికారులు హుటాహుటిన నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలోనే ఓ ఖైదీ మృత్యువాత పడ్డాడు. మరో ఖైదీకి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. స్వైన్ ఫ్లూతో ఖైదీ మరణించాడన్న వార్తతో జైలులోని ఇతర ఖైదీలు వణికిపోతున్నారు. ఖైదీలను వైరస్ నుంచి కాపాడేందుకు జైలు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.