: రాష్ట్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం


రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు రోడ్డు ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై ఆయన కలెక్టర్లతో మాట్లాడారు. ఆయా ఘటనల్లో అతివేగమే ప్రమాదానికి కారణమని వారు సీఎంకు వివరించారు. రహదారుల భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్ వద్ద, కృష్ణా జిల్లా పెద పాలపర్రు వద్ద, చిత్తూరు జిల్లా నడిమూరు వద్ద నేడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మోరంపూడి వద్ద ముగ్గురు చనిపోగా, పెద పాలపర్రులో ఐదుగురు, నడిమూరు వద్ద ఓ సైనికుడు ప్రాణాలు విడిచారు.

  • Loading...

More Telugu News