: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ రహస్యంగా చేతులు కలిపాయి: మోదీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మరింత ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు నిర్వహించాయి. బీజేపీ ఏర్పాటు చేసిన సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రహస్యంగా చేతులు కలిపాయని ఆరోపించారు. నిత్యం ఆందోళనలు జరిపే పార్టీకి ఓటేయవద్దని ప్రజలకు సూచించారు. గతంలో ప్రజల మద్దతు పొందిన పార్టీ నెలన్నర వ్యవధిలోనే చేతులెత్తేసిందని పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించారు. ఢిల్లీకి అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీని గెలిపించారని, ఢిల్లీ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని వడ్డీతో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ తాగునీటి సమస్య తీర్చేందుకు హర్యానా రాష్ట్రం సాయం చేస్తుందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చాయని గుర్తుచేశారు. మనదేశంలో 75 శాతం యువత ఉందని, ఆ యువత దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతుందని ఆకాంక్షించారు. తన వెనుక 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారని అనుక్షణం గుర్తుచేసుకుంటానని ప్రధాని అన్నారు.

  • Loading...

More Telugu News