: జెట్ ఎయిర్ వేస్ పైలెట్లకు ఎంత కష్టం!
ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు భద్రతావారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పైలెట్లు ఓ వారంపాటు మద్యం తాగరాదని, సీ ఫుడ్ కు దూరంగా ఉండాలని ఆదేశించింది. పైలెట్లకు అవగాహన కలిగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, కచ్చితంగా ఆదేశాలు పాటించాల్సిందేనని జెట్ ఎయిర్ వేస్ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు బయల్దేరడానికి 12 గంటల ముందు ఎలాంటి సీ ఫుడ్ తీసుకోకూడదని ఆంక్షలు విధించారు. సకాలంలో విధులకు హాజరయ్యేందుకు ఈ అవగాహన ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది.