: కాంట్రాక్టర్ల కిడ్నాప్ తో మాకు సంబంధం లేదు: న్యూ డెమోక్రసీ గోపన్న


వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించిన కాంట్రాక్టర్ల కిడ్నాప్ వ్యవహారంపై నిషిద్ధ న్యూ డెమోక్రసీ గ్రూపు స్పందించింది. కాంట్రాక్టర్ల కిడ్నాప్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని న్యూ డెమోక్రసీ వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోపన్న స్పష్టం చేశారు. కిడ్నాప్ తమ పని కాదని అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ వద్ద రోడ్డు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు వెంకటేశ్వర్ రెడ్డి, శిరీష్ రెడ్డిలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో అపహరించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ కు పాల్పడింది న్యూ డెమోక్రసీ కార్యకర్తలని పోలీసులు భావించారు.

  • Loading...

More Telugu News