: ఉద్యోగులకు ముందు వసతి, ఆ తర్వాతే రాజధాని తరలింపు: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు


ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించిన తర్వాతే నవ్యాంధ్ర రాజధానిని తుళ్లూరుకు తరలించాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. నెల్లూరులో కొద్దిసేపటి క్రితం ముగిసిన ఏపీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల చంద్రబాబునాయుడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. హెల్త్ కార్డుల జారీలో అలసత్వం ప్రదర్శిస్తున్న సర్కారు, పీఆర్సీ విషయంలోనూ నాన్చుడు ధోరణిని అవలంబిస్తోందని ఆక్షేపించారు. తక్షణమే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News