: నాడు ‘గాలి’ ఎవరో తెలియదన్నాడు... నేడు కోర్టులో కౌగిలించుకున్నాడు: జగన్ పై సోమిరెడ్డి ఫైర్


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ దీక్షకు నిరసనగా నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాలుపంచుకున్న సోమిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదన్న జగన్, మొన్నటికి మొన్న నాంపల్లి కోర్టులో జనార్దన్ రెడ్డిని కౌగిలించుకున్నారని ఆరోపించారు. జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని సోమిరెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News