: హైదరాబాదు వచ్చాడు... స్వైన్ ఫ్లూ అంటించుకున్నాడు: ఉరవకొండ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ


అనంతపురం జిల్లాలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాలోని ఉరవకొండకు చెందిన వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఇటీవల హైదరాబాదు వచ్చిన సదరు వ్యక్తి తిరిగి తన సొంతూరు చేరుకున్నాడు. హైదరాబాదు నుంచి స్వగ్రామానికి చేరిన వెంటనే అతడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతడికి సోకిన వ్యాధిని స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో హైదరాబాదులోనే అతడికి వ్యాధి సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News