: ఢిల్లీలో విజయం మాదే... మూడొంతుల్లో రెండొంతుల సీట్లు గెలుస్తాం: అమిత్ షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మూడొంతుల్లో రెండొంతుల సీట్లలో తమ పార్టీ అభ్యర్థులే గెలవనున్నారని ఆయన పేర్కొన్నారు. నిన్న ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం ఢిల్లీలో పాలనపగ్గాలు చేపట్టే పార్టీ బీజేపీనేనని కూడా ఆయన పేర్కొన్నారు. కిరణ్ బేడీ సీఎం అభ్యర్థిత్వంపై స్పందించిన అమిత్ షా... కిరణ్ బేడీ తమకు తప్పనిసరి ప్రత్యామ్నాయమేమీ కాదని, నీతివర్తన నేపథ్యంలోనే ఆమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపామని తెలిపారు. కేంద్రంతో కలిసి పనిచేసే ప్రభుత్వమే ఢిల్లీ ప్రజలకు అవసరమని ఆయన పేర్కొన్నారు.