: ప్రోటోకాల్ ను పక్కనబెట్టనున్న చైనా అధ్యక్షుడు... రేపు సుష్మా స్వరాజ్ తో భేటీ


చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రోటోకాల్ ను పక్కనబెట్టేయనున్నారు. తమ దేశ పర్యటనకు వచ్చిన భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో ఆయన నేరుగా భేటీ కానున్నారు. ఈ భేటీ రేపు జరుగుతుందని చైనా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా వివిధ దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో చైనా అధ్యక్షుడు నేరుగా భేటీ కారు. చైనా ప్రధాని కాని, ఏడుగురు సభ్యుల పొలిట్ బ్యూరోలోని ఓ నేత కాని ఈ సమావేశాలు నిర్వహిస్తారు. అయితే, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తో మాత్రం నేరుగా తానే భేటీ కావాలని జీ జిన్ పింగ్ నిర్ణయం తీసుకున్నారట. ఇందుకోసం ఆయన ఇప్పటిదాకా అమలవుతున్న ప్రోటోకాల్ ను కూడా పక్కనబెడుతున్నారు. అమెరికాతో భారత సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలోనే జిన్ పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News