: ‘స్వైన్ ఫ్లూ’ కేసులకు తక్షణ వైద్యం... నిర్ధారణ పేరిట జాప్యం తగదు: ఏపీ మంత్రి గంటా
స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు తక్షణ వైద్యం అందించాల్సిందేనని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి నిర్ధారణ పేరిట రోగులకు వైద్యం అందించడంలో జాప్యం చేయరాదని సూచించారు. వ్యాధిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ వ్యాధికి సంబంధించి వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిని నిలువరించే విషయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.