: సెమీస్ లో తెలుగు వారియర్స్ లక్ష్యం 142
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్( సీసీఎల్)లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రెండో సెమీఫైనల్ లో ముంబై హీరోస్ జట్టు తెలుగు వారియర్స్ కు 142 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టాలీవుడ్ వారియర్స్ తొలుత ముంబై హీరోస్ బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై హీరోస్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలో తడబడ్డ ముంబై తరువాత తేరుకుని గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ముంబై ఆటగాళ్లలో బెహ్రావానీ(42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేయడం గమనార్హం. టాలీవుడ్ బౌలర్లలో సచిన్ జోషికి రెండు వికెట్లు లభించాయి.