: 'ఆర్థిక ఇబ్బందులున్నాయి...అంతా సముద్రంలో దూకుతాం'
ఆర్థిక ఇబ్బందులు నిండు జీవితాల్ని బలితీసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విఛ్చిన్నమై, జీవితం విలువ చెప్పే పెద్దలు లేక, ఉన్నవాళ్లు ఆదుకోక నిండు జీవితాలు బలైపోతున్నాయి. హైదరాబాదులోని వనస్థలిపురంలోని ఓ నిండు కుటుంబం అదృశ్యమైంది. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బారావు అనే వ్యాపారి, భార్య గిరిజ, కుమార్తె సన్నిహిత, కుమారుడు త్రివిక్రమ్ సహా అదృశ్యమయ్యారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక, కుటుంబం మొత్తం సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని తన సోదరుడికి సూసైడ్ నోటు రాసిన ఆయన, ఆ తరువాత కనిపించకుండాపోయారు. సుబ్బారావు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.