: ధోనీకి ఇంటి బెంగ పట్టుకుందా?
టీమిండియా వరల్డ్ కప్ కలను సుసాధ్యం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, ఇప్పుడు పేలవమైన ప్రణాళికలు వేయడం వెనుక ఓ కారణం వుంది. అది ఏంటంటే, భార్య బెంగ! ధోనీతో ప్రతి టూర్ కి వెంటవెళ్లే భార్య ఆసీస్ టూర్ లో కనబడలేదు. కారణం ఏంటనుకుంటున్నారు... త్వరలోనే ధోనీకి అతని భార్య సాక్షి ప్రమోషన్ ఇవ్వనుంది. తొందర్లోనే ధోనీ తండ్రి కాబోతున్నాడు. భార్య ఇంటి దగ్గర, తనేమో ఆసీస్ టూర్లో, అందుకేనేమో టీమిండియా కెప్టెన్ పేలవమైన వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించలేకపోతున్నాడు. వ్యక్తిగతంగా కూడా పెద్దగా రాణించడం లేదు. సాక్షి తల్లి కానుండడంతో ఈసారి టీమిండియా టూర్లో కనిపించడం లేదు. ఐపీఎల్ అవినీతి ఆరోపణలు వచ్చిన తరువాత టీమిండియాతో కలిసి కనిపించడం తగ్గించిన సాక్షి, వరల్డ్ కప్ లో కనిపిస్తుందో లేక, దూరంగా ఉండి కెప్టెన్ కి టెన్షన్ పుట్టిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.