: కొకైన్ తో పట్టుబడ్డ మలయాళ హీరో
ప్రముఖ మలయాళ హీరో షినే టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ అనే మాదకద్రవ్యాన్ని కలిగి ఉన్నందుకు ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో చాకోతోపాటు మరో నలుగురు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కొచ్చిలో మహ్మద్ నిషమ్ అనే వ్యాపారి నివాసంలో వీరిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.