: కేజ్రీవాల్ స్థిరత్వాన్ని అలవర్చుకోవాలి: ప్రత్యర్థి సూచన
ఆమ్ ఆద్మీ నేత, సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నూపుర్ శర్మ ఓ సూచన చేశారు. కేజ్రీ స్థిరత్వాన్ని అలవర్చుకోవాలని ఆమె కోరారు. "జీవితంలో కేజ్రీవాల్ కొంత స్థిరత్వం పొందాలి. అప్పుడే ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వెళ్లాలి. కొన్నిసార్లు ఇక్కడుంటే, మరికొన్ని సార్లు అక్కడుంటారు. ప్రజలను ఆయన ఫూల్స్ చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు కేజ్రీ చెప్పే అబద్ధాలను అర్థం చేసుకుంటారు. ఈసారి సీఎం అవ్వాలని ఆయన కోరుకోవడం కేవలం కలే" అని శర్మ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ప్రత్యర్థిగా నూపుర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.