: నీ జాతకం, నీ మామ జాతకం రోజుకొకటి బయటపెడతా: హరీష్ కు వార్నింగ్ ఇచ్చిన రేవంత్
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు లాంటి వాళ్ల బెదిరింపులకు భయపడేవాడిని కానని రేవంత్ అన్నారు. 'నీ జాతకం, నీ మామ (కేసీఆర్) జాతకం రోజుకొకటి చొప్పున బయట పెడతా'నని హరీష్ ను హెచ్చరించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం... అనవసర విషయాలపై దృష్టి సారిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ కేబినెట్ మొత్తం కేసీఆర్ భజనలో నిమగ్నమైందని ఆరోపించారు. బంగళాలపై ఉన్న ఆసక్తి... రాష్ట్రంలో నెలకొన్న కరవు, రైతు ఆత్మహత్యలపై ఎందుకు లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ సర్కారు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న వారు... ఆ విషయంపై ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.