: 'బాహుబలి' వీడియో లీక్ కేసును ఛేదించిన సీసీఎస్ పోలీసులు
'బాహుబలి' వీడియో లీక్ కేసును సీసీఎస్ పోలీసులు ఛేదించారు. 'మకుట విజువల్ ఎఫెక్ట్స్' అనే సంస్థ నుంచి ఈ సినిమా వీడియో లీకైనట్టు గుర్తించారు. వీడియోను లీక్ చేసిన ఆ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచినట్టు చెప్పారు. ఇందులో సంబంధం ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని, వర్మను రిమాండ్ కు తరలిస్తున్నామని సీసీఎస్ డీసీపీ తెలిపారు. మొత్తం 13 నిమిషాల ఫైటింగ్ సీన్లను మాత్రమే తీసుకెళ్లినట్టు గుర్తించామని చెప్పారు. విజువల్ ఎఫెక్స్ట్ కోసం ఇచ్చిన ఈ చిత్ర వీడియోని తన ల్యాప్ టాప్ ద్వారా యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సప్ ల్లో వర్మ మిత్రులకు షేర్ చేశాడని, వాటిని అతని స్నేహితుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాడని పోలీసులు వివరించారు. బాహుబలి చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలు లీక్ అయినట్టు చిత్ర దర్శకుడు రాజమౌళి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.