: రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె ఆమే... బయటపెట్టిన విపక్ష నేత!


తండ్రి ఒక దేశాధ్యక్షుడైనా, సంవత్సరాల తరబడి బయటి ప్రపంచానికి కనపడకుండా కాలం గడుపుతున్న ఆమె గుట్టు బయటపడింది. తన ఇద్దరు కుమార్తెలను మీడియాకు, ప్రజలకూ దూరంగా పెంచిన రష్యా అధ్యక్షుడు ఇప్పుడు కాస్తంత ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. విపక్ష నేత ఒకరు ఆయన కుమార్తె జాడ వెల్లడించారు. పుతిన్ కుమార్తె క్యాథరినా వ్లాదిమిర్నోవా తికొనోవా ప్రస్తుతం మాస్కో స్టేట్ యూనివర్సిటీతో కలసి పనిచేస్తున్న ఓ సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్సిటీకి కొత్త భవనం నిర్మాణ పనులను తికొనోవా దగ్గరుండి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. "అవును ఆమె పుతిన్ కుమార్తె" అని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని మాస్కో వర్శిటీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మాస్కో మీడియాకు తికొనోవా సుపరిచితమే. అయితే ఆమె తమ అధ్యక్షుడి వారసురాలన్న విషయం మాత్రం తెలియదు. ఈ విషయంపై తికొనోవా స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించినా ఆమె అందుబాటులో లేరు. కాగా, పుతిన్ మరో కుమార్తె మరియా ఎక్కడ ఉన్నారన్న విషయం ప్రజలకు ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

  • Loading...

More Telugu News