: ఢిల్లీ ఎన్నికలకు ఆప్ మేనిఫెస్టో విడుదల


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో, పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో అధినేత అరవింద్ కేజ్రీవాల్ మేనిఫెస్టో పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ఆప్ ఎన్నికల ప్రణాళికను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసేలా తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్టు వెల్లడించారు. బీజేపీ ఎన్నికల్లో హామీలిచ్చేందుకు భయపడుతోందన్న కేజ్రీ, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. అభివృద్ధి, మహిళా రక్షణ, మంచినీరు, నగరంలో విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అజెండాలో ప్రధానంగా దృష్టి సారించారు. కాగా తాము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఢిల్లీ జన లోక్ పాల్ బిల్లును పాస్ చేస్తామని హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News