: శ్రీవారిని దర్శించుకున్న నటుడు కల్యాణ్ రామ్
సినీ హీరో కల్యాణ్ రామ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 'పటాస్' సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా తిరుపతి వచ్చిన ఆయన చిత్ర యూనిట్ తో కలసి ఈ ఉదయం వీఐపీ ప్ర్రారంభదర్శన సమయంలో పాల్గొని వెంకటేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. తరువాత తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాను హీరోగా నటించిన 'పటాస్' చిత్రం విజయవంతమైన నేపథ్యంలోనే స్వామివారిని దర్శించుకున్నానని కల్యాణ్ రామ్ మీడియాకు తెలిపారు. మంచి కథ దొరికితే సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, బాబాయి బాలకృష్ణలతో తప్పకుండా కలసి నటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు.