: జడ్జిలపై సీపీఎం నేత వివాదాస్పద వ్యాఖ్య... 4 వారాల జైలు


జడ్జిలను 'ఫూల్స్' అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేసిన కేరళ సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే ఎంవీ జయరాజన్ పై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో జూన్ 23, 2010లో కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ రహదారుల పక్కన బహిరంగ సభలను నిషేధించింది. దానిపై మండిపడిన జయరాజన్, తీర్పు చెప్పిన జడ్జిలను ఫూల్, ఇడియట్ అంటూ పరుష పదజాలంతో దూషించారు. వెంటనే స్పందించిన హైకోర్టు ఆయను కోర్టు ధిక్కారం కింద దోషిగా నిర్ధారించి, ఆరు నెలల జైలుశిక్ష విధించింది. తరువాత శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్ జిత్ సేన్, జస్టిస్ నాగప్పన్ ల ద్విసభ్య ధర్మాసనం నాలుగు వారాలకు కుదించింది. తీర్పులపై విమర్శలు చేస్తే ఊరుకోమని, న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేదిలేదని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News