: ఆప్ అభ్యర్థి నివాసంలో 5 వేల మద్యం సీసాలు


నిజాయతీ, మచ్చలేని రాజకీయాలే లక్ష్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి... ఆ పార్టీ అభ్యర్థి నరేశ్ బాల్యన్ పెద్ద తలనొప్పే తీసుకొచ్చాడు. ఈ ఉదయం నరేశ్ నివాసంలో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా 5 వేల మద్యం సీసాలు బయటపడ్డాయి. దీంతో, తనిఖీలు నిర్వహించిన అధికారులే కాక, విషయం తెలుసుకున్న ఆప్ నేతలు కూడా షాక్ కు గురయ్యారు. ఈ ఉదంతం విపక్షాలకు మంచి ఆయుధాన్నే అందించినట్టయింది. ఆప్ చెప్పేవి మాత్రమే నీతులని, చేతల్లో అలాంటిదేమీ ఉండదని ఇప్పటికే విపక్ష నేతలు వాగ్బాణాలను ఎక్కుపెట్టారు.

  • Loading...

More Telugu News