: గన్స్ తో ఫోటోలకు పోజులు... ఏలూరులో పేలిన తుపాకీ!
అతనో పోలీసు కానిస్టేబుల్. నిత్యమూ తుపాకులు చేతుల్లోనే ఉంటాయి. ఎందుకో వాటిని అటూ ఇటూ తిప్పుతూ సినిమా స్టైల్ లో ఫోటోలు తీయించుకుందామని అనుకున్నాడు. చేతిలో ఎస్ఎల్ఆర్ తుపాకి పట్టుకొని ఫోటోలు దిగుతుండగా అది పేలింది. ఈ ఘటన ఏలూరు ఎస్పీ కార్యాలయంలో జరిగింది. మొగల్తూరుకు చెందిన కానిస్టేబుల్ చిన్నబాబు చేతిలోని ఎస్ఎల్ఆర్ గన్ మిస్ ఫైర్ అయింది. కొన్ని బులెట్లు గాల్లోకి దూసుకుపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గన్స్ పట్టుకొని ఫోటోలు దిగుతున్న వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.