: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి 50 డాలర్ల జరిమానా
ఆయన సాక్షాత్తూ అమెరికాకు విదేశాంగ శాఖ మంత్రి. అయితేనేం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడచుకున్నారు. తన ఇంటిముందు పేరుకుపోయిన మంచును తొలగించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ఆగ్రహించిన అధికారులు ఆయనపై 50 డాలర్ల జరిమానా విధించారు. అమెరికాలో ఎవరి ఇంటి ముందు ఉండే మంచు కుప్పను వారే తొలగించుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ సీజన్లో అమెరికాను మంచు తుపాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నిత్యమూ పెద్దయెత్తున మంచు కురుస్తూ ఉండటంతో సగటు ప్రజల జీవనం స్తంభించింది.