: వివాదం రేపిన 'డాక్టరువా? పశువులు కాసుకునేదానివా?' డైలాగులు: మంత్రి వ్యాఖ్యలు


హర్యానా మంత్రి మహిళా వైద్యురాలిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. 30 ఏళ్ల నుంచి ప్రభుత్వ సర్వీసులో ఉన్న కురుక్షేత్ర చీఫ్ మెడికల్ ఆఫీసర్ వందనా భాటియాపై ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రితో జరిగిన మూడున్నర నిమిషాల సంభాషణను వందనా భాటియా రికార్డు చేసి, సీడీలు పంచారని ఆరోపణలు వచ్చాయి. కాగా, ఆ సీడీల్లో 'డాక్టరువా? లేక పశువులు కాసుకునేదానివా?' అని మంత్రి అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కృషణ్ కుమార్ బేడీ ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డాక్టర్పై ఆయన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను సస్పెండ్ చేశారంటూ వార్తలు వెలువడ్డాయి. కాగా ఫోన్లో తన పట్ల ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారని, కఠిన పదజాలం ఉపయోగించారని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News