: అనంతపురంలో పడగవిప్పిన ఫ్యాక్షన్...ఫైనాన్షియర్ హత్య
అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ పగలు పడగవిప్పాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షన్ భూతం మరోసారి జడలు విప్పినట్టు కనబడుతోంది. నడి రోడ్డుపై వేట కొడవళ్లతో నరికి హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనల్లోకి నెడుతున్నారు. మొన్నీమధ్యే ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా దుండగులు నరికారు. ఆయన కొనప్రాణాలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా అనంతపురం పట్టణంలో ఫైనాన్షియర్ ఆదిశేషారెడ్డిని ఓ హోటల్ బయట కళ్లలో కారం కొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోసారి ఫ్యాక్షన్ హత్యలు చోటుచేసుకుంటున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.